టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్రం ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురి కాకుండా ఈజీగా టోల్ పేమెంట్ చేయోచ్చు. అయితే ఇప్పుడీ ఫాస్టాగ్ పేమెంట్ విషయంలో సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే?
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ బాలుడు ఫాస్టాగ్ స్టిక‍్కర్ అంటించి ఉన్న కారు అద్దాలు తుడిచేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలో తన చేతికి ఉన్నవాచ్‌ను..ఆ ఫాస్టాగ్ స్టిక్కర్ మీద ట్యాప్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో అనుమానం వచ్చిన కారులోని ప్రయాణికులు సదరు బాలుడ్ని " ఏం చేస్తున్నావు. ఇటు రా అంటూ" పిలుస్తారు. దీంతో కారు అద్దం తుడుస్తున్న బాలుడు..కారు యజమానికి దగ్గరికి రాగా..ఫాస్టాగ్ స్టిక్కర్ మీద ఎందుకు ట్యాప్ చేస్తున్నావు? అని ఆ వాచ్ గురించి అడగ్గా.. బాలుడు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళతాడు.
A video is spreading misinformation about Paytm FASTag that incorrectly shows a smartwatch scanning FASTag. As per NETC guidelines, FASTag payments can be initiated only by authorised merchants, onboarded after multiple rounds of testing. Paytm FASTag is completely safe & secure. pic.twitter.com/BmXhq07HrS
— Paytm (@Paytm) June 25, 2022
ఆ బాలుడిని పట్టుకునేందుకు కారులో ఉన్న ప్రయాణికుడు వెంబడిస్తాడు. కానీ ఆ బాలుడు తప్పించుకోవడంతో వెంబడించిన వ్యక్తి నిరాశతో తిరిగి వచ్చి ఇదంతా ఫాస్టాగ్ స్కామ్, ఆ బాలుడిని ఉద్దేశిస్తూ.. ఇలాంటి వారు కారు అద్దాలు తుడుస్తూ స్మార్ట్ వాచ్‌తో ఫాస్టాగ్ ద్వారా డ్రైవర్లు, యజమానుల బ్యాంక్ అకౌంట్‌లలో ఉన్న మనీని కాజేస్తారని ఆరోపిస్తాడు.
ఫాస్టాగ్ అనేది
ఫాస్టాగ్ అనేది ప్రీపెయిడ్ రీఛార్జబుల్ ట్యాగ్ సర్వీస్. దీంతో కారు డ్రైవర్లు లేదా, యజమానులు టోల్ ప్లాజాల వద్ద ఆటోమెటిక్ పేమెంట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. టోల్ గేట్ల వద్ద కారు ముందు అద్దానికి దగ్గరలో అంటించిన స్కానర్‌పై ట్యాప్ చేస్తే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీతో సదరు ఫాస్టాగ్ అకౌంట్‌లో నుంచి ఆటోమెటిగ్గా డబ్బులు డిడక్ట్ అవుతాయి. ఇప్పుడీ బాలుడు కూడా ఆ స్కానర్‌పై వాచ్‌తో ట్యాప్ చేశాడని, అలా చేయడం వల్ల డబ్బులు అకౌంట్‌ల నుంచి ట్రాన్స్‌ఫర్ అవుతాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇది నిజమా? కాదా?
అయితే ఇది నిజమా? కాదా? అని ప్రశ‍్నిస్తూ ఐఏఎస్ అధికారి అవానిష్ శరాణ్ ఆ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుండగా..ఫాస్టాగ్ సర్వీసుల్ని అందిస్తున్న పేటీఎం ఆ వీడియోపై స్పందించింది.
స్పందించిన పేటీఎం
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏమాత్రం వాస్తవం లేదని పేటీఎం కొట్టి పారేసింది.నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రకారం(ఎన్‌ఈటీసీ)..ఫాస్టాగ్ చెల్లింపులు చాలా సురక్షితం. ఫాస్టాగ్ లావా దేవీలు పూర్తిగా రిజిస్టర్డ్ మర్చంట్‌లు మాత్రమే స్కాన్ చేసుకోవచ్చు. మినహాయించి ఎవరు చేసినా ఆ బార్ కోడ్‌లు స్కాన్ చేయలేవు అంటూ వివరణ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment