
న్యూఢిల్లీ: లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీలో ఉన్న ఇటలీ సంస్థ లంబోర్గినీ సరికొత్త మైలురాయిని అధిగమించింది. భారత్‌లో ఇప్పటి వరకు 400 కార్లను విక్రయించి రికార్డు సాధించినట్టు సో మవారం ప్రకటించింది. దేశంలో 2007 నుంచి పూర్తి స్థాయి అమ్మకాలను ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది.
‘భారతదేశంలో 400 లంబోర్గినీ కార్ల విక్రయ రికార్డును సాధించినందుకు మాకు సంతోషంగా ఉంది. ఈ ప్రయా ణంలో మాకు మద్దతుగా నిలిచిన మా కస్టమర్‌లకు అభినందనలు’’ అని లంబోర్గిని ఇండి యా హెడ్ శరద్ అగర్వాల్ పేర్కొన్నారు.