ఈవీ ఛార్జింగ్ సదుపాయాల కల్పన కోసం మెజెంటా భారీ పెట్టుబడులు | Magenta to invest RS 250 crore to set up EV manufacturing plant in Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఈవీ ఛార్జింగ్ సదుపాయాల కల్పన కోసం మెజెంటా భారీ పెట్టుబడులు

Published Wed, Nov 24 2021 7:23 PM | Last Updated on Wed, Nov 24 2021 7:23 PM

Magenta to invest RS 250 crore to set up EV manufacturing plant in Tamil Nadu - Sakshi

ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన కోసం పెట్టుబడులు పెట్టడానికి మెజెంటా ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంఒయు) చేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, మెజెంటా ఎండి, సీఈఓ మాక్సన్ లూయిస్ సమక్షంలో ఈ ఎంఒయుపై సంతకాలు చేశారు. కోయంబత్తూరులో జరిగిన తమిళనాడు ఇన్వెస్ట్ మెంట్ కాన్ క్లేవ్ 2021లో ఈ ఒప్పందం కింద మెజెంటా దాదాపు రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ-మొబిలిటీ ప్రపంచంలో ఈవీ టెక్నాలజీల డిజైన్, ప్రొడక్ట్ డెవలప్ మెంట్, ఆర్కిటెక్చర్ ప్రమాణాలపై దృష్టి సారించే తయారీ యూనిట్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు.

తమిళనాడులో కొత్త తయారీ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతంలోని స్థానిక సమాజాలకు ఉద్యోగ అవకాశాలను అందిస్తుందని, రాష్ట్రంలో రాబోయే రెండేళ్లలో సుమారు 500 ఉద్యోగాలను సృష్టిస్తుందని మెజెంటా చెప్పారు. ఇంకా, రాబోయే ఐదేళ్లలో 1,600 మందికి పైగా ఉద్యోగులను చేర్చుకొనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో ఈవీ ఛార్జర్ తయారీ, అసెంబ్లీ, ఇన్ స్టలేషన్ వంటి కార్యకలాపాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. సోలార్ ఆధారిత ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ వే భారతదేశపు మొదటి ఈవీ ఛార్జింగ్ కారిడార్ రూపకల్పనలో సహాయం, మొబైల్ లోని అన్ని ఛార్జింగ్ స్టేషన్ల ఇంటిగ్రేటెడ్, ఆటోమేటెడ్ నెట్ వర్క్ ఛార్జ్ గ్రిడ్ యాప్ సేవలు అందించనున్నట్లు మెజెంటా చెప్పారు. 

(చదవండి: విద్యార్థినులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement