
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సత్య నాదేళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల (26) మరణించాడు. చిన్నప్పటి నుంచి సెలెబ్రల్ పాల్సీ అనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు జైన్ నాదెళ్ల. సోమవారం ఉదయం జైన్ నాదెళ్ల ఈ లోకాన్ని విడిచి వెళ్లినట్టు మైక్రోసాఫ్ట్ పేర్కొంది.
జైన్ నాదెళ్ల మృతితో సత్యనాదెళ్ల, అను నాదెళ్ల దంపతులు శోకసముద్రంలో మునిగిపోయారు. తన కుమారుడు పుట్టుకతోనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు 2017 అక్టోబరులో తొలిసారిగా సత్యనాదెళ్ల బయటి ప్రపంచానికి వెల్లడించారు. 1996 ఆగస్టు 13న జైన్ నాదెళ్ల జన్మించాడు.