
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం మంచి లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. గత కొద్ది రోజులుగా షేర్ల ధరలు భారీగా పడిపోవడంతో తక్కువ ధరలో షేర్లు లభిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు వస్తున్న, ఆర్బీఐతో జరిగిన సమావేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌కి ఊరట కలిగించాయి. రష్యా - ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలలో తాత్కాలిక ఉపశమనం మార్కెట్‌కి మరింత బూస్ట్ ఇచ్చింది. దీంతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి.
ముగింపులో, సెన్సెక్స్ 1,736.21 పాయింట్లు(3.08%) పెరిగి 58,142.05 వద్ద నిలిస్తే, నిఫ్టీ 509.70 పాయింట్లు(3.03%) పెరిగి 17,352.50 వద్ద స్థిర పడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.32 వద్ద ఉంది. నిఫ్టీలో టాటా మోటార్స్, ఐచర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీ సిమెంట్స్, హీరో మోటోకార్ప్ షేర్లు రాణిస్తే.. సీప్లా, ఒఎన్‌జిసిలు నష్టపోయాయి. ఆటో, బ్యాంక్, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, పిఎస్‌యు బ్యాంక్, ఐటి & ఎఫ్ఎంసీజీ నేతృత్వంలోని అన్ని సెక్టోరల్ సూచీలు 2-3 శాతం పెరిగాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment