
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన రోజంతా అదే తీరును కొనసాగించింది. 1200 పాయింట్లకుపైగా నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్56 వేల 395 వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం అనంతరం.. కాస్త కోలుకొని నష్టం 200 పాయింట్లకు దిగివచ్చింది. చివరలో మళ్లీ అమ్మకాలతో ఒడుదొడుకులకు లోనైంది. ఉక్రెయిన్ కేంద్రంగా నాటో, రష్యాల మధ్య నెలకొన్న వివాదం మరింత తీవ్రమైంది.
దీని ప్రభావం నేరుగా స్టాక్ మార్కెట్‌పై కనిపించింది. ఉక్రెయిన్ విషయంలో ఇటు రష్యా, అటూ అమెరికా వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం తప్పదనే పరిస్థితి నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లు మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ముగింపులో, సెన్సెక్స్ 382.91 పాయింట్లు(0.66%) క్షీణించి 57300.68 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 114.50 పాయింట్లు(0.67%) క్షీణించి 17092.20 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.84 వద్ద ఉంది.
ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ మోటార్స్, ఓఎన్జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు స్వల్పంగా లాభపడితే.. బీపీసీఎల్, టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఎక్కువగా నష్టపోయాయి. ఐటీ, మెటల్, ఆయిల్ & గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ & పిఎస్యు బ్యాంక్ సూచీలు 1-3 శాతం తగ్గడంతో నష్టాల్లో ముగిశాయి. దీంతో బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.7-1.6 శాతం పడిపోయాయి.
(చదవండి: గేమింగ్ ప్రియులకు అమెజాన్ శుభవార్త.. ల్యాప్‌టాప్స్ మీద అదిరిపోయే డిస్కౌంట్..!)
Comments
Please login to add a commentAdd a comment