
తీవ్ర ఒడిదుడుకుల మధ్య శుక్రవారం దేశీయ స్టాక్ట్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 303 పాయింట్ల లాభాంతో 69,856 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల స్వల్ప లాభంతో 20,969 వద్ద ముగిసింది.
హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా.. అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, హీరోమోటో కార్పొ, ఓఎన్‌జీసీ, బ్రిటానియా, ఎం అండ్ ఎం, దివిస్ ల్యాబ్స్ నష్టాలతో ముగిశాయి.