ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఉద్యోగులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరాలకునేవారికి కూడా ఉద్యోగావకాలు రాకుండా పోతున్నాయి. ఈ విషయం మీద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
2023 చివరి వరకు సాగిన ఉద్యోగుల తొలగింపులు 2024లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి 24500 కంటే ఎక్కువమంది గత జనవరిలో ఉద్యోగాలు కోల్పోయారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీల వల్ల ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు.. ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఇద్దరూ నష్టపోతున్నారని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగార్థులు మారాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటూ.. నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సీతారామన్ తెలిపారు. సంస్థలు కూడా కొత్త టెక్నాలజీలను ఆహ్వానిస్తున్నాయి, దీంతో కొత్త నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు ప్రాధాన్యమిస్తూ.. మిగిలిన వారిని ఇంటికి పెంపేస్తున్నాయి. కాబట్టి ఉద్యోగులు తమ స్కిల్స్ పెంచుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్ - ఎవరికి లాభం, ఎవరికి నష్టం..
ఇటీవల 2024 మధ్యంతర బడ్జెట్ సమర్పిస్తూ.. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా ప్రభుత్వం ఇప్పటికి 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ అందించినట్లు వెల్లడించారు. అంతే కాకుండా 54 లక్షల మంది యువతకు కొత్త స్కిల్స్ నేర్పించినట్లు, దీని కోసం ప్రభుత్వం 3000 ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 15 ఎయిమ్స్, 390 యూనివర్సిటీలను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment