న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. 2022-23 వార్షిక బడ్జెట్‌పై ఆర్థికమంత్రి పలు వర్గాలతో ఈ నెల ప్రారంభం నుంచి సమావేశాలు నిర్వహిస్తూ, వారి అభిప్రాయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా సమావేశం డిసెంబర్ 30వ తేదీన ఇక్కడి విజ్ఞాన్ భవల్‌లో జరుగనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి పార్లమెంటులో కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మోదీ 2.0 ప్రభుత్వానికి, ఆర్థికమంత్రికి ఇది నాల్గవ వార్షిక బడ్జెట్. దీనికి సంబంధించి ఇప్పటికే పారిశ్రామికవేత్తలు, ఫైనాన్షియల్ రంగానికి చెందిన నిపుణులు, కార్మిక సంఘాలు, వ్యవసాయ రంగ ప్రతినిధులు, ఆర్థికవేత్తలతో నిర్మలా సీతారామన్ ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 22 వరకూ ఎనిమిది దఫాల్లో వర్చువల్‌గా ఈ సమావేశాలు జరిగాయి. దాదాపు 120 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. ఆదాయపు పన్ను శ్లాబ్‌ల హేతుబద్దీకరణ, డిజిటల్ సేవలకు మౌలిక రంగం హోదా, హైడ్రోజన్ స్టోరేజ్‌కి ప్రోత్సాహకాలు వంటి ప్రతిపాదనలు వారి నుంచి కేంద్రానికి అందాయి.
(చదవండి: జనవరి 1 నుంచి ఆటో ఎక్కితే మోత మోగాల్సిందే..!)
Comments
Please login to add a commentAdd a comment