జంతువు ఆకారంలో ఉన్న ఈ బుల్లివాహనం ఆటబొమ్మ కాదు, రోబో. అలుగు ఆకారాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంగ్లండ్‌లోని సర్రీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ రోబోకు రూపకల్పన చేశారు.
వెనుక వైపు రెండు చక్రాలు, ముందువైపు అలుగు కాళ్లలాంటి కాళ్లు, మిగిలిన భాగమంతా అలుగు శరీరాన్ని తలపించేలాంటి లోహపు రేకుల అమరికతో ‘ప్లాంటోలిన్’ పేరుతో దీనిని తయారు చేశారు. అడవులు నరికివేతకు గురైన ప్రాంతాల్లో తిరిగి మొక్కలు నాటే ఉద్దేశంతో దీనిని రూపొందించారు.
ఈ రోబో ముందువైపునున్న కాళ్లతో మట్టిని తవ్వేస్తుంది. మధ్యనున్న భాగం విత్తనాలను నాటుతుంది. విత్తనాలను నాటాక, కాళ్లతో మట్టిని తిరిగి కప్పేస్తుంది. నరికివేతకు గురైన అటవీ ప్రాంతాల్లో వేలాదిగా మొక్కలను నాటడం మనుషులకు చాలా శ్రమతో కూడుకున్న పని. ఈ శ్రమను తగ్గించడానికే సర్రీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు డాక్టర్ రాబర్ట్ సిద్దాల్, డోరతీ ఈ ‘ప్లాంటోలిన్’ రోబోను తయారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment