పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంకులో కొత్తగా కస్టమర్లను చేర్చుకోవడం తక్షణమే ఆపేయాలని పేటిఎమ్'ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మార్చి 11న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై పేటీఎమ్ మార్చి 12న స్పందించింది. ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా కొత్త ఖాతాదారులను ఆన్ బోర్డింగ్ చేయకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేటిఎమ్ తెలిపింది. "పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ సాధ్యమైనంత త్వరగా ఆర్‌బీఐ లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి రెగ్యులేటర్‌తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉంది. ఆర్‌బీఐ ఆమోదం పొందిన తర్వాత కొత్త ఖాతాలను తిరిగి ప్రారంభించేటప్పుడు మేము తెలియజేస్తాము" అని రుణదాత తన ప్రకటనలో తెలిపింది.
అయితే, కొత్త కస్టమర్లు పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంకులో కరెంట్ లేదా సేవింగ్స్ ఖాతాలను తెరవలేరు. నూతన వినియోగదారులు పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌ను కూడా తెరవలేరని రుణదాత పేర్కొంది. ఇంకా, పేటిఎమ్ యాప్ వినియోగించే కొత్త వినియోగదారులు పేటిఎమ్ యుపీఐ హ్యాండిల్స్ సృష్టించవచ్చు, వాటిని వారి ప్రస్తుత పేమెంట్స్ బ్యాంక్ ఖాతా లేదా ఇతర బ్యాంకు ఖాతాలకు లింక్ చేయవచ్చు అని తెలిపింది. "బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 35A కింద ఆర్‌బీఐ తన అధికారాల మేరకు.. పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ని కొత్త వినియోగదారులను ఆన్‌బోర్డింగ్ చేయకుండా తక్షణమే నిలిపివేయాలని ఆదేశించినట్లు" ఆర్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది. బ్యాంకు పర్యవేక్షణ లోపాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
(చదవండి: ఫ్లీజ్ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్‌కు రష్యా బంపరాఫర్!)
Comments
Please login to add a commentAdd a comment