Paytm IPO Day 1 Highlights: ఎన్నో అంచనాల మధ్య ఇన్షియల్ పబ్లిక ఇష్యూ (ఐపీవో)కి వచ్చిన పేటీఎంకి చుక్కెదురైంది. జోమాటో తరహాలో సంచలం సృష్టిస్తుందనే మార్కెట్ అంచనాలు తారుమారు అయ్యాయి. డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ పబ్లిక్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి నామమాత్ర స్పందన లభించింది. తొలి రోజు(సోమవారం) 18 శాతం బిడ్స్ మాత్రమే దాఖలయ్యాయి. ఐపీవోలో భాగంగా 4.83 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. అయితే తొలి రోజు 88.23 లక్షల షేర్ల కోసం దరఖాస్తులు దాఖలయ్యాయి.
రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 78 శాతం స్పందన లభించగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 2 శాతమే బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో ఆఫర్ చేసిన 2.63 కోట్ల షేర్లకుగాను 16.78 లక్షల షేర్ల కోసం బిడ్స్ లభించాయి. ఇష్యూ ఈ నెల 10న(బుధవారం) ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment