అంతర్జాతీయ టెక్నాలజీ సామాన్యులకే చేరినప్పుడే దానికి అసలైన సార్థకత చేకూరుతుంది. ఈ క్రమంలో వ్యవసాయానికి టెక్నాలజీనీ అనుసంధానం చేసే పనిలో ఉంది మహీంద్రా గ్రూపు. ఇప్పటికే అగ్రికల్చర్‌కి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను జత చేస్తూ క్రిష్ యాప్‌ను నెలకొల్పారు. వ్యవసాయానికి అవసరమైన యంత్రాలను ఎప్పటి నుంచో ఈ గ్రూపు తయారు చేస్తోంది.
అయితే డ్రోన్లను పూర్తి స్థాయిలో వినియోగించడం మొదలు పెడితే వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయంటున్నారు ఆనంద్ మహీంద్రా. అందుకే డ్రోన్‌లకు ఏం పేరు పెడితే బాగుంటుంది అంటూ నెటిజన్లను ట్విట్టర్‌లో ప్రశ్నించారు. తన వంతుగా డ్రోన్ ఆచార్యా.. ద్రోణాచార్య అంటూ ఓ పేరును సూచించాడు. కొందరు నెటిజన్లు తమ వంతుంగా మహీంద్రోన్, డ్రోన్ అగ్రి అంటూ కొన్ని పేర్లు సూచించారు.
Drones are destined to become a part of our daily lives. But nowhere will they have a more beneficial effect than in farmlands. Any ideas on what to name our Agri-drones? ‘Drone-acharya’ obviously works better for battle drones. What’s a good nickname for these green warriors? pic.twitter.com/dOR0iUT5QO
— anand mahindra (@anandmahindra) February 10, 2022
Comments
Please login to add a commentAdd a comment