ఉక్రెయిన్‌పై యుద్దం ప్రకటించినప్పటీనుంచి రష్యా అనేక ఆంక్షలను ఎదుర్కొంటుంది. అమెరికాతో పాటుగా పలు యూరప్ దేశాలు రష్యా బ్యాంకులపై, కుబేరులపై భారీ ఆంక్షలను విధిస్తోంది. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంతగా క్షీణించింది. అమెరికా, పలు ఇతర దేశాలు ఆర్థికంగా రష్యా దెబ్బ తీసేందుకు సిద్దమయ్యాయి. అయితే ఆంక్షల నుంచి రష్యాను గట్టేక్కించేందుకు పుతిన్ కౌంటర్ ఎటాక్ మొదలెట్టారు. ఆంక్షలు విధించడం మీకే కాదు మాకు తెలుసంటూ అమెరికన్ కంపెనీలపై కన్నెర్ర చేశాడు. చైనాతో కలిసి పలు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాడు.
వీసా, మాస్టర్ కార్డులకు భారీ షాక్..!
రష్యన్ బ్యాంకులపైన, కుబేరులు, కంపెనీలపైన అమెరికా, ఈయూలు ఆర్థిక ఆంక్షలను విధిస్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ పైనాన్షియల్ సంస్థలు వీసా, మాస్టర్ కార్డులు రష్యాకు భారీ షాకిస్తూ తమ సేవలను ఆ దేశంలో నిలిపివేస్తున్నామని ప్రకటించాయి. దీంతో రష్యన్ ప్రజలు క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించలేకపోతున్నారు. రష్యాలో సుమారు 30 కోట్ల క్రెడిట్, డెబిట్ కార్డుల్లో 21.6 కోట్ల వీసా, మాస్టర్ కార్డులు ఉన్నాయి. అయితే ప్రజలకు ఎలాంటి అవాంతరాలను లేకుండా చేసేందుకు రష్యా యంత్రాంగం సిద్దమైంది. ఆయా అమెరికన్ కంపెనీలకు కౌంటర్ అటాక్‌ను ఇచ్చేందుకు సిద్దమైంది రష్యా.
చైనా చెంతకు రష్యా..!
వీసా, మాస్టర్ కార్డు సేవలకు ప్రత్నామ్నాయంగా రష్యన్ బ్యాంకులు చైనాను ఆశ్రయించాయి. చైనాకు చెందిన యూనియన్‌పే(UnionPay)ను స్వీకరించేందుకు రష్యన్ బ్యాంకులు సిద్దమయ్యాయి. రష్యాకు చెందిన ప్రముఖ బ్యాంకులు Sberbank , Tinkoff చైనా యూనియన్‌పే సిస్టమ్ పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే రష్యాకు చెందిన అతిపెద్ద బ్యాంకు స్బేర్‌బ్యాంక్ యూనియన్‌పే సేవల లాంచ్ తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఈ నిర్ణయం చైనాకు కలిసిరానుంది. ఒకవేళ యూనియన్‌పే రష్యాలో ఎదగితే ఆయా అమెరికన్ కంపెనీలకు భారీ నష్టం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2015లో రష్యా మీర్(Mir) పేమెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది.
చదవండి: రష్యా దెబ్బకు ఆ దేశాలు ఉక్కిరిబిక్కిరి..! రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్...!
Comments
Please login to add a commentAdd a comment