ముంబై: నేడు బేర్ దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే మార్చి నెలలో వడ్డీ రేట్లను పెంచే అవకాశమున్నట్లు సంకేతాలు రావడంతో ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. దీంతో, ఆ ప్రభావం మన దేశీయ మార్కెట్లపై మీద కూడా పడింది. దీంతో ట్రేడింగ్ ఆరంభం నుంచే సూచీల పతనం మొదలైంది. ఉదయం మార్కెట్ ప్రారంభమైన తొలి 5 నిమిషాల్లోనే సుమారు రూ.4 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, అమెరికా-రష్యా మధ్య ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల వంటి కారణాల చేత సూచీలు నేటి ట్రేడింగ్‌ను భారీ నష్టాలతో మొదలుపెట్టాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం 11.30 గంటల సమయంలో సెన్సెక్స్ పాయింట్లు 1,181.85(2.04%) నష్టపోయి 56,643.21 వద్ద నిలిస్తే, నిఫ్టీ 343.30 పాయింట్లు(1.98%) పతనమై 16,934.65 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 80 సూచీలు 27 షేర్లు, నిఫ్టీ 50 సూచీలో 47 షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
(చదవండి: Budget 2022: జీఎస్టీ పరిధిలోకి నేచురల్ గ్యాస్..!)
Comments
Please login to add a commentAdd a comment