
ముంబై: బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మంగళవారం ఆరంభ నష్టాలను పూడ్చుకొని లాభాల్లో ముగిశాయి. ఉదయం సెషన్‌లో 288 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 246 లాభంతో 54,768 వద్ద ముగిసింది. నిఫ్టీ 92 పాయింట్ల పతనం నుంచి తేరుకొని 62 పాయింట్ల లాభంతో 16,341 వద్ద నిలిచింది. ఇంధన, ఫార్మా, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ నెలకొనడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు ఒకశాతం లాభపడ్డాయి.
విదేశీ ఇన్వెస్టర్లు రూ.976 కోట్ల విలువ షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.101 కోట్ల విలువ షేర్లను అమ్మేశారు. బ్యాంక్ ఆఫ్ జపాన్, యూరోపియన్ యూనియన్ బ్యాంక్ ద్రవ్య పాలసీ వెల్లడి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. కాగా, డాలరుతో రూపాయి మారకం విలువ మంగళవారం ఇంట్రాడేలో కొత్త ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 80.05ను తాకింది. చివరికి 6 పైసలు బలపడి 79.92 వద్ద ముగిసింది.
ఆరంభంలో అమ్మకాల ఒత్తిడి
ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్లో ట్రేడింగ్ ఉదయం నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 270 పాయింట్ల నష్టంతో 54,251 వద్ద, నిఫ్టీ 92 పాయింట్లను కోల్పోయి 16,187 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే, దేశీయ మార్కెట్లోని సానుకూలతల ప్రభావానికి తోడు బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లలో కొనుగోళ్లు నెలకొనడంతో సూచీలు ఆరంభ నష్టాలను పూడ్చుకోగలిగాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు ...
n అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో గ్యాస్ సెక్టార్‌పై కూడా విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలతో గెయిల్, ఓఎన్‌జీసీ షేర్లు 2–3% నష్టపోయాయి.
n గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఊపందుకోవచ్చని పరిశ్రమ వర్గాల అంచనాలతో టీవీఎస్ మోటార్, ఐషర్ మోటార్స్ షేర్లు 1–2 శాతం లాభపడ్డాయి.

Comments
Please login to add a commentAdd a comment