
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఆరంభంలో నష్టాలను ఎదుర్కొన్న సూచీలు తరువాత పుంజుకున్నాయి. మిడ్ సెషన్ నుంచి మరింత ఎగిసి పటిష్టంగా ముగిసాయి. సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 51, 531 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 15173 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా కీలక సూచీలు రెండూ రికార్డు క్లోజింగ్‌స్థాయిలను నమోదు చేశాయి. అయితే నిఫ్టీ బ్యాంకు స్వల్ప నష్టాల్లో ముగిసింది. మెటల్, ఎఫ్‌ఎంసిజి , ఐటీ రంగాలు లాభాలను సాధించగా , పీఎస్‌యు బ్యాంక్, ఆటో, రియాల్టీ నష్టాల్లో ముగిశాయి.
ఐషర్ మోటార్స్,టైటర్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, కోల్ ఇండియాభారీగా నష్టపోయాయి. హిందాల్కో, సన్ వపర్మా, రిలయన్స్,అదానీ, టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరో వైపు సీరం వ్యవస్థాపకుడు అదార్ పూనావాలా 60 శాతం వాటాలను కొనుగోలుచేయనున్నారనే వార్తలతో మాగ్మా ఫిన్‌కార్ప్ అప్పర్ సర్క్యూట్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment