
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరవ రోజూ భారీ లాభాలతో కళ కళలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 611 పాయింట్ల లాభంతో 51343 వద్ద, నిఫ్టీ 177 పాయింట్ల లాభంతో 15100 వద్ద ట్రేడవుతోన్నాయి. ఎస్‌బీఐ, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్‌లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. ఎం అండ్ ఎం, అదాని పోర్ట్స్ గెయిల్ టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. అటు దివీస్ ల్యాబ్స్, బ్రిటానియా, ఎన్టీపీసీ నిఫ్టీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు అటు బీపీసీఎల్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ఆస్ట్రాజెనెకా ఫార్మా, బాల్కృష్ణ ఇండస్ట్రీస్, బాంబే డైయింగ్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ క్యూ3 ఫలితాలను ప్రకటించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment