డేటా సైన్స్‌ నిపుణులకు తీవ్ర కొరత | Severe shortage of data science‌ specialists | Sakshi
Sakshi News home page

డేటా సైన్స్‌ నిపుణులకు తీవ్ర కొరత

Published Tue, Oct 19 2021 5:18 AM | Last Updated on Tue, Oct 19 2021 5:18 AM

Severe shortage of data science‌ specialists - Sakshi

ముంబై: దేశంలో డేటాసైన్స్‌ నిపుణులకు తీవ్ర కొరత నెలకొంది. ఎడ్‌టెక్‌ కంపెనీ ‘గ్రేట్‌ లెరి్నంగ్‌’ ఒక అధ్యయనం నిర్వహించగా.. కంపెనీల హైరింగ్‌ మేనేజర్లలో (నియామకాలను చూసేవారు) 92 శాతం మంది డేటా సైన్స్‌ నిపుణుల విషయంలో డిమాండ్‌–సరఫరా మధ్య భారీ అంతరం ఉన్నట్టు చెప్పారు. 57 శాతం మంది ప్రారంభస్థాయి నిపుణుల విషయంలో అంతరం ఉందని చెప్పగా.. 27 శాతం మంది మేనేజర్లు మధ్యస్థాయి ఉద్యోగాలైన టీమ్‌లీడ్‌ (బృంద నాయకులు), ప్రాజెక్ట్‌ మేనేజర్‌ నిపుణుల విషయంలో కొరత ఉన్నట్టు తెలిపారు. నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (ఎన్‌ఎల్‌పీ) నైపుణ్యాలకు కొరత ఉందని 15 శాతం మంది హైరింగ్‌ మేనేజర్లు తెలిపారు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ నిపుణుల కొరత ఉందని 12 శాతం మంది మేనేజర్లు చెప్పారు. ఆ తర్వాత ఆటోమేషన్, కంప్యూటర్‌ విజన్, అనలైటిక్స్‌ నిపుణుల సరఫరా తగినంత లేదని మేనేజర్లు పేర్కొన్నారు. 100కు పైగా కంపెనీలకు చెందిన హెచ్‌ఆర్‌ మేనేజర్ల అభిప్రాయాలను ఈ అధ్యనంలో భాగంగా గ్రేట్‌ లెరి్నంగ్‌ తెలుసుకుంది. ‘‘ప్రతీ పరిశ్రమ డిజిటల్‌ దిశగా మారిపోతోంది. డేటా సైన్స్‌ కార్యకలాపాల్లో భాగమైన ఎన్‌ఎల్‌పీ, ఏఐఎంఎల్, బిగ్‌డేటా, ఆటోమేషన్‌కు డిమాండ్‌ అధిక స్థాయిల్లో ఉంది. ఈ నూతన అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా మన విద్యా ప్రమాణాలను మెరుగుపరచుకోవడంతోపాటు.. ఉద్యోగులకు శిక్షణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది’’ అని గ్రేట్‌ లెరి్నంగ్‌ సహ వ్యవస్థాపకుడు హరి కృష్ణన్‌ నాయర్‌ తెలిపారు. డేటా సైన్స్‌ నిపుణుల నియామకాల్లో బెంగళూరు టాప్‌లో ఉండగా..  తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement