
ముంబై: వరుసగా మూడు రోజుల పాటు భారీ లాభాలను చూసిన స్టాక్ మార్కెట్ శుక్రవారం స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో ఈ వారం ప్రారంభం నుంచి రికార్డు స్థాయిలో లాభాలు చూసిన మార్కెట్‌లో కరెక‌్షన్ ఉండవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అయితే శుక్రవారం ఉదయం నిఫ్టీ స్వల్ప లాభాల్లో ఉండగా. సెన్సెక్స్ స్వల్ప నష్టాలతో మొదలై.. ఆ వెంటనే కోలుకుంది.
అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు ఏషియా మార్కెట్ సూచీలు మిశ్రమ ఫలితాలు ఇస్తుండటంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీంతో శుక్రవారం మార్కెట్ ఫ్లాట్‌గా కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 54,492 పాయింట్లతో మొదలైంది. కొద్ది సేపటికి కేవలం 2 పాయింట్లు నష్టపోయింది. ఆ తర్వాత కోలుకుంది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 11 పాయింట్లు లాభపడి 54,504 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6 పాయింట్లు లాభపడి 16,301 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఈ రోజు మార్కెట్‌లో గ్లెన్‌మార్క్ లైఫ్ సెన్సైన్స్ లిస్ట్ అయ్యింది. పదిహేను వందల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ఈ కంపెనీ స్టాక్‌మార్కెట్‌లోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment