కేంద్ర బడ్జెట్ 2025-26 (Union Budget 2025-26) రాకకు ఇంక కొన్ని రోజులే ఉంది. రానున్న బడ్జెట్ బంగారంపై (Gold) కస్టమ్స్ సుంకాన్ని పెంచవచ్చని ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి. తద్వారా ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ధర తగ్గుదల సమయంలో బంగారం కొనుగోలు చేయడం వ్యూహాత్మక చర్యగా నిపుణులు సూచిస్తున్నారు.
2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బంగారం, వెండి కడ్డీలపై కస్టమ్స్ సుంకాన్ని 15% నుండి 6%కి తగ్గించారు. తదనంతరం 2024 ఆగస్టులో బంగారం దిగుమతులు సంవత్సరానికి సుమారుగా 104% పెరిగి 10.06 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే అదే సమయంలో భారత్ నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 23% పైగా క్షీణించి 1.99 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
గత బడ్జెట్‌లో ధరలను స్థిరీకరించడానికి, నిరంతర ద్రవ్యోల్బణం మధ్య తగినంత సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. అయితే దిగుమతి సుంకం తగ్గింపు పెరిగిన బంగారం వినియోగం గురించి ఆందోళనలను లేవనెత్తింది. ఇది వాణిజ్య లోటును విస్తరిస్తుంది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బంగారు వినియోగదారు అయిన భారత్ తన డిమాండ్‌ను తీర్చుకోవడానికి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది.
బడ్జెట్ కంటే ముందే కొనేయాలా?
డాలర్ బలపడుతున్నప్పటికీ గత వారం బంగారం ధరలు పెరిగాయి. బంగారం మార్కెట్ నుండి ఆరోగ్యకరమైన డిమాండ్, దేశీయ స్టాక్ మార్కెట్‌లో బలహీనత బంగారం ధరలలో నిరంతర పెరుగుదలకు దారితీసింది. గత వారం 1 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని పెంచితే దేశీయ మార్కెట్‌లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
"బంగారం పట్ల పెరుగుతున్న ట్రెండ్‌ను అరికట్టడానికి, ముఖ్యంగా గత సంవత్సరం దిగుమతి సుంకాల తగ్గింపును అనుసరించి ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పెంచవచ్చు" అని ఎస్ఎస్ వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకుడు సుఖంద సచ్‌దేవా అభిప్రాయపడ్డారు. "దిగుమతి సుంకం పెంపు బంగారం ధరను పెంచుతుంది, తత్ఫలితంగా దేశీయ ధరలు పెరుగుతాయి. ధర తగ్గుదల సమయంలో బంగారం కొనుగోలు చేయడం వ్యూహాత్మక చర్యగా మారుతుంది. ఎందుకంటే కొనుగోలుదారులు స్వల్పకాలిక అంచనా ధరల పెరుగుదల నుండి ప్రయోజనం పొందవచ్చు" అన్నారు.
అయితే, బంగారం ధరలకు కస్టమ్స్ సుంకం పెంపు ఒక్కటే ఉత్ప్రేరకం కాదు. ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని ముట్టుకోకపోయినా, అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. "పన్ను పెంపు లేకున్నా, ప్రపంచ ఆర్థిక దృశ్యం అనిశ్చితంగానే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి పాలసీ మార్పులు బంగారం సురక్షిత ఆకర్షణను పెంచగలవు. ఇదే నెలలో జరగనున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశాన్ని మార్కెట్ భాగస్వాములు నిశితంగా పరిశీలిస్తారు. ప్రధాన ద్రవ్యోల్బణం డిసెంబరులో తగ్గినప్పటికీ గత రెండు నెలలుగా ఇది స్థిరంగా ఉంది. వడ్డీ రేటు తగ్గింపుపై ఫెడరల్ రిజర్వ్ తన వైఖరిని పునఃపరిశీలించవచ్చు. ఇది బంగారం ధరలకు మద్దతు ఇవ్చవచ్చు" అని సుఖంద సచ్‌దేవా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment