న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఎస్‌జేవీఎన్ (గతంలో సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్) రూ. 700 కోట్ల భారీ పెట్టుబడితో 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ–రివర్స్ వేలం ప్రక్రియ ద్వారా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ) నుండి ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నట్లు ఎస్‌జేవీఎన్ ఒక ప్రకటనలో తెలిపింది.
నిర్మాణానికి సంబంధించి యూనిట్‌కు రూ.2.90 (టారిఫ్), అలాగే స్వయం నిర్వహణ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును పొందినట్లు పేర్కొంది. తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎస్‌జీఈఎల్ ద్వారా భారతదేశంలో ఎక్కడైనా ప్రాజెక్ట్‌ను చేపట్టి, అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment