
Skanda Aerospace: హైదరాబాద్ కేంద్రంగా హెలికాఫ్టర్ పార్ట్‌లను తయారు చేసే మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ప్రముఖ స్కందా ఏరో స్పేస్ సంస్థ వందల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
రఘు వంశీ మెషిన్ టూల్స్, అమెరికాకు చెందిన రేవ్ గేర్ సంస్థలు సంయుక్తంగా రాజధానిలో స్కందా ఏరో స్పేస్ ప్రొడక్షన్ పేరుతో యూనిట్‌ను నెలకొల్పనున్నారు. ఈ ప్రొడక్షన్ యూనిట్‌లో హెలికాఫ్టర్ గేర్స్, గేర్ బాక్స్‌లను తయారు కానున్నాయి. ఇందుకోసం సుమారు రూ.250కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
అమెరికా టెక్సాస్‌లో ఉన్న రేవ్ గేర్స్ తో పాటు రఘు వంశీ మెషిన్ టూల్స్ సంస్థ సైతం ఏవియేషన్ సంస్థలతో పాటు ఇతర ఆటో మోటీవ్ సంస‍్థలకు కావాల్సిన ఉత్పత్తుల్ని సరఫరా చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment