టెక్నాలజీలో బెంగళూరుతో పోటీ పడేందుకు హైదరాబాద్ రెడీ అవుతోంది. స్టార్టప్ కల్చర్ నగరంలో వేళ్లూనుకుంటోంది. నగరం నుంచి ఫస్ట్ స్టార్టప్ యూనికార్న్ వచ్చిన మరుసటి రోజే మరో తీపి కబురు అందింది.
నిధుల సమీకరణ
ఎయిరోస్పేస్ టెక్నాలజీపై హైదరాబాద్ కేంద్రంగా స్కైరూట్ స్టార్టప్ పని చేస్తోంది. గడిచిన 18 నెలల కాలంలో విక్రమ్ స్పేస్ లాంచ్ సిరీస్‌లో ప్రొపల్షన్ టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేశారు. ఇక పూర్తి స్థాయి ఫలితాలుకు కొద్ది దూరంలో ఈ స్టార్టప్ ఉంది. కాగా ఈ స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఫండ్ రైజింగ్‌లో భాగంగా సిరీస్ బీలో స్కైరూట్ 4.5 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమీకరించింది. అంతకు ముందు సిరీస్ ఏలో 11 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడిని తేగలిగింది. ఇప్పటి వరకు స్కైరూట్‌లో వెంచర్ క్యాపిటలిస్టులు 17 మిలియన్ డాలర్ల (రూ. 127 కోట్లు) వరకు పెట్టుబడులు పెట్టారు.
2022లో రాకెట్ ప్రయోగం
నిధుల సమీకరణ బాగుండటంతో రాకెట్ లాంఛింగ్‌కి అవసరమైన ‘క్రిటిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ పనులు శరవేగంగా చేసుకుంటూ పోతోంది స్కూరూట్. 2022లోనే స్కైరూట్ విక్రమ్ రాకెట్‌ను ప్రయోగించాలనే లక్ష్యంతో పని చేస్తోంది. రాకెట్ టెక్నాలజీ ఇన్‌ఫ్రా విషయంలో ఇస్రో, స్కూరూట్‌ల మధ్య ఎంఓయూ ఉంది.
సీన్ మారుతోంది
హురున్ ఇండియా ఇటీవల వెల్లడించిన స్టార్టప్ జాబితాలో హైదరాబాద్ పెద్ద పీట దక్కలేదు. కొత్తగా వస్తున్న స్టార్టప్‌లు, స్టార్టప్‌లన ఉంచి యూనికార్న్‌గా ఎదుగుతున్న సంస్థలు ఎక్కువగా బెంగళూరు, ముంబై, ఢిల్లీల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. కానీ రాబోయే రోజుల్లో హైదరాబాద్ పరిస్థితి మెరుగుపడవచ్చనే నమ్మకాన్ని రోజురోజుకు సానుకూల ఫలితాలు ప్రకటిస్తున్న స్టార్టప్‌లు కల్పిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఎయిరోస్పేస్ టెక్నాలజీ కొత్త రూపు తీసుకోబోతోంది. ఇక్కడ నెలకొల్పిన స్టార్టప్ కంపెనీలపై వెంచర్ క్యాపిటలిస్టులు నమ్మకం చూపించడం ఈ నమ్మకాన్ని బలపరుస్తోంది.
చదవండి:యూనికార్న్ కంపెనీగా అవతరించిన హైదరాబాద్ కంపెనీ.. కేటీఆర్ అభినందనలు!
Comments
Please login to add a commentAdd a comment