దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. మూడు రోజుల విజయ పరంపరకు బ్రేక్ వేస్తూ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు వారంలో చివరి ట్రేడింగ్ సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 403.24 పాయింట్లు లేదా 0.52 శాతం క్షీణించి 76,639.58 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు 77,069.19-76,263.29 రేంజ్‌లో ట్రేడయింది.
అదేవిధంగా ఎన్‌ఎస్‌ఈ (NSE) నిఫ్టీ 50 108.60 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 23,203.20 వద్ద ముగిసింది. నిఫ్టీ50 23,292.10 వద్ద గరిష్ట స్థాయికి చేరుకోగా, రోజు కనిష్ట స్థాయి 23,100.35 వద్ద నమోదైంది.
నిఫ్టీ50లోని 50 స్టాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, బిపిసిఎల్, హిందాల్కో, హిందాల్కో, కోల్ ఇండియా నేతృత్వంలోని 29 లాభాలతో గ్రీన్‌లో ముగిశాయి. మరోవైపు ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో వంటి 21 షేర్లు నష్టాల్లో ముగిసి 5.75 శాతం వరకు నష్టపోయాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment