భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 230.05 పాయింట్లు లేదా 0.28 శాతం క్షీణించి 81,381.36 వద్ద ముగియగా, ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 34.20 పాయింట్లు లేదా 0.14 శాతం క్షీణించి 24,964.25 వద్ద ముగిసింది.
టీసీఎస్, మహీంద్రా&మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్, సిప్లా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్ నేతృత్వంలోని 30 సెన్సెక్స్ స్టాక్‌లలో 13, 50 నిఫ్టీ స్టాక్‌లలో 22 ప్రతికూలంగా ముగిశాయి. ఈ షేర్ల ధరలు 1 శాతం నుంచి 2 శాతం వరకు తగ్గాయి.
మరోవైపు హెచ్‌సీఎల్ టెక్, ట్రెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టీలో లాభాలను అందుకున్నాయి. విస్తృత మార్కెట్లలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.44 శాతం లాభాలతో బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment