యూనియన్ బడ్జెట్ ప్రారంభమైంప్పటి నుంచి వరుస నష్టాల్లో సాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయంలో భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 1,292.92 పాయింట్ల భారీ లాభంతో 81,332.72 వద్ద, నిఫ్టీ 428.75 పాయింట్ల లాభంతో 24,834.85 వద్ద ముగిసింది.
శ్రీరామ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, సిప్లా, భారతి ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్, అశోక్ లేల్యాండ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే, ఫెడరల్ బ్యాంక్ వంటి సంస్థలు టాప్ లూజర్స్ జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment