దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 25,185కు చేరింది. సెన్సెక్స్ 183 పాయింట్లు పుంజుకుని 82,142 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 103.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.3 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.09 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.77 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.87 శాతం పుంజుకుంది.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ నెట్‌వర్క్ సేవలకు డేట్ ఫిక్స్
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. చైనా సహాయక ప్యాకేజీలు, అక్కడ అందుబాటులో ఉన్న షేర్ల విలువలు ఎఫ్‌పీఐలను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రానున్న యూఎస్ ఎన్నికలు, ఎఫ్‌ఐఐలు చైనావైపు మొగ్గు చూపుతుండడం వంటి అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నట్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ మార్కెట్ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలని సూచిస్తున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment