దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 09:15 సమయానికి నిఫ్టీ 8 పాయింట్లు పెరిగి 26,012కు చేరింది. సెన్సెక్స్ 42 పాయింట్లు లాభపడి 85,202 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 100.90 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.79 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.19 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.04 శాతం లాభపడింది.
ఇదీ చదవండి: వేగంగా వృద్ధి చెందుతున్న రంగం
ఫెడ్ కీలక వడ్డీరేట్లను కట్ చేస్తున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లు గరిష్ఠాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నవారిలో దాదాపు 93 శాతం మంది నష్టాల్లోనే ఉంటున్నట్లు పలు సంస్థల సర్వేలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఈ ట్రేడింగ్ చేస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలని, కొత్తగా ఈక్విటీ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నవారు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎంచుకోకపోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment