దేశీయ స్టాక్‌మార్కెట్‌లు బుధవారం నష్టాల్లో ముగిశాయి.అంతర్జాతీయ ప్రతికూల సెంటిమెంట్‌లతో దేశీయ ప్రామాణిక సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ తన 14 రోజుల విజయ పరంపరను కోల్పోయింది.
ప్రామాణిక సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్ 202.80 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టపోయి 82,352.64 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 81.15 పాయింట్లు లేదా 0.33 శాతం పడిపోయి 25,198.70 వద్ద ముగిసింది.
నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 31 నష్టాల్లో ముగిశాయి. విప్రో, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, హిందాల్కో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ 3.05 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. అదే సమయంలో ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా ఇండెక్స్‌లోని ఇతర స్టాక్‌లలో 2.50 శాతం వరకు లాభాలను ఆర్జించాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment