దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం స్పల్ప నష్టాలతో ప్రారంభమైన బెంచ్‌మార్క్ సూచీలు సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. అంతర్జాతీయంగా బలహీనమైన సెంటిమెంట్‌తో అన్ని రంగాలలో అమ్మకాలు జరిగాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 398.13 పాయింట్లు లేదా 0.49 శాతం క్షీణించి 81,523.16 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 122.65 పాయింట్లు లేదా 0.49 శాతం పడిపోయి 24,918.45 వద్ద ముగిసింది.
నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 34 నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, ఓన్‌జీసీ, విప్రో, ఎల్&టీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5.73 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. అదే సమయంలో, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇండెక్స్‌లోని ఇతర స్టాక్‌లలో 4.03 శాతం వరకు లాభాలను ఆర్జించాయి.
ఇదీ చదవండి: నేడు బంగారం కొనబోతే..
అదేవిధంగా బీఎస్ఈలో సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్ స్టాక్‌లలో 20 రెడ్‌లో ముగిశాయి. టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్ 5.77 శాతం వరకు పతనమయ్యాయి. అదే సమయంలో ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, హిందుస్తాన్ యూనిలీవర్ 2.18 శాతం వరకు లాభాలతో ముగిసిన 10 స్టాక్‌లలో ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment