గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలని చవి చూశాయి. సెన్సెక్స్ 950.06 పాయింట్లు లేదా 1.17 శాతం లాభంతో 81,906.39 వద్ద, నిఫ్టీ 271.30 పాయింట్లు లేదా 1.11 శాతం లాభంతో.. 24,738.75 వద్ద నిలిచాయి.
టైటాన్ కంపెనీ, టీసీఎస్, ట్రెంట్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 24,524కు చేరింది. సెన్సెక్స్ 226 పాయింట్లు పుంజుకుని 81,186 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 106.25 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.6 శాతం లాభపడింది. నాస్‌డాక్ 1.3 శాతం పుంజుకుంది.
గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం కీలక నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం మీడియాకు వివరిస్తారు. భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన నేపథ్యంలో కీలక రుణ రేటు రెపో యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందన్నది మెజారిటీ ఆర్థికవేత్తల అంచనా.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment