శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 843.16 పాయింట్లు లేదా 1.04 శాతం లాభంతో 82,133.12 వద్ద, నిఫ్టీ 219.60 పాయింట్లు లేదా 0.89 శాతం లాభంతో 24,768.30 వద్ద నిలిచాయి.
భారతి ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ కంపెనీ, హిందూస్తాన్ యూనీలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ 161 పాయింట్లు నష్టపోయి 24,382కు చేరింది. సెన్సెక్స్ 581 పాయింట్లు దిగజారి 80,688 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 106.9 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.32 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.54 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.66 శాతం దిగజారింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో కొంత ఊరట నిచ్చింది. సూచీ 5.48 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆహార ఉత్పత్తులు ప్రత్యేకించి కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment