![stock market updates on febraury 06 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/stock-market-gain.jpg.webp?itok=VF4QkntN)
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం గత సెషన్‌తో పోలిస్తే స్థిరంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు నష్టపోయి 23,696కు చేరింది. సెన్సెక్స్(Sensex) 30 పాయింట్లు పెరిగి 78,303 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.66 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.39 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.19 శాతం ఎగబాకింది.
ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ బుధవారం ప్రారంభమైంది. కొత్త ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ వడ్డీ రేట్లు, పరపతి విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్‌బీఐ కీలకంగా చూసేది ద్రవ్యోల్బణాన్నే. వినియోగ ధరల ఆధారిత సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం) డిసెంబర్ త్రైమాసికానికి 4.5 శాతానికి తగ్గుముఖం పడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 4.8 శాతంగా ఉంటుందన్నది ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా. జనవరి నెల ద్రవ్యోల్బణం 4.5 సమీపంలో ఉండొచ్చని పేర్కొంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment