సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ అంశంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. గత విచారణలో కోర్టు కోరిన వివరాలు ఇచ్చేందుకు సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా మరి కొంత సమయం కావాలని కోరారు. రుణాల మారటోరియంకు సంబంధించి కేంద్రం, ఆర్బీఐ తీసుకున్న సమగ్ర వివరాలను సమర్పించాలని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం ఎస్‌జీని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకునే ప్రక్రియ తుదిదశలో ఉందని కోర్టుకు ఎస్‌జీ తెలిపారు. అదేవిధంగా సమగ్ర వివరాలు అందించేందుకు మరికొంత గడువు ఇవ్వాలని కోరారు. కేంద్రానికి గడువు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు అక్టోబర్ 5కి వాయిదా వేసింది. చదవండి: (ఆర్‌బీఐ, ప్రపంచ పరిణామాలే కీలకం!)
Comments
Please login to add a commentAdd a comment