interest waiver
-
హైదరాబాద్ వాసులకు సువర్ణావకాశం..
సాక్షి, హైదరాబాద్: జలమండలి నీటి బకాయిల చెల్లింపునకు వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) వెసులుబాటు మరో వారం రోజుల్లో ముగియనుంది. గడువు కాలంలో పెండింగ్ బిల్లులను చెల్లిస్తే ఆలస్య రుసుముతో పాటు వడ్డీపై రాయితీ పొందవచ్చు. దీర్ఘకాలికంగా బిల్లులు చెల్లించని వినియోగదారులకు జలమండలి సువర్ణావకాశం కల్పించింది. వినియోగదారులు సకాలంలో బకాయిలు చెల్లించే విధంగా విస్తృత ప్రచారం చేపట్టింది. బకాయిలున్న కనెక్షన్లు 7 లక్షలపైనే.. జలమండలి పరిధిలో సుమారు 13.50 లక్షలు నల్లా కనెక్షన్లు ఉండగా అందులో సుమారు 7.1 లక్షల కనెక్షన్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తమ్మీద దాదాపు రూ.1,706 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో ఆలస్య రుసుముతో పాటు వడ్డీ రూపంలో ఉన్న రూ.1,189 కోట్ల బకాయిలు మాఫీ కానున్నాయి.చెల్లింపు విధానం ఇలా.. జలమండలి కార్యాలయాల్లోని క్యాష్ కౌంటర్లల్లో చెల్లించవచ్చు. ఆన్లైన్ విధానంలో.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా NEFT, RTGS, BPPS ద్వారా.. జలమండలి అధికారిక వెబ్ సైట్ hyderabadwater.gov.in/enకు లాగిన్‌తో.. లైన్మెన్లు గృహాలను సందర్శించినప్పుడు వారి దగ్గర ఉండే EPOS యంత్రం ద్వారా కూడా చెల్లించవచ్చు. మీ సేవ, ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా సై తం బిల్లు చెల్లించే అవకాశాన్ని కల్పించారు. జలమండలి అందించే QR Code స్కాన్ చేసి చెల్లించవచ్చు.వడ్డీ మాఫీ పరిధి ఇలా.. నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ కోసం అధికారులకు స్థాయిని బట్టి అమౌంట్ పరిధిని నిర్ణయించారు. మేనేజర్ స్థాయిలో రూ.2000 వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.2001 నుంచి రూ.10,000 వరకు, జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.10,001 నుంచి రూ.1,00,000 వరకు, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.1,00,001 నుంచి అంతకంటే ఎక్కువ బిల్లు మాఫీ చేసే అధికారం ఉంది. మొబైల్ నంబర్లకు సమాచారం జలమండలి పెండింగ్ బిల్లుల వినియోగదారుల క్యాన్ నంబర్‌కు అనుసంధానమైన మొబైల్ నంబరుకు బకాయి మొత్తం, ఎంత చెల్లించాలి, ఎంత మాఫీ అవుతుంది తదితర వివరాలన్నీ సంక్షిప్త సమాచారం పంపిస్తోంది. సామాజిక మాధ్యమాలైన ట్విటర్, ఫేస్ బుక్, ఎల్రక్టానిక్ మీడియా, ఎఫ్ఎం రేడియో, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ఓటీఎస్–2024 పథకం గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తోంది. ఓటీఎస్ పథకంపై ఏవైనా సందేహాలుంటే.. జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.నిబంధనలు ఇలా.. u ఓటీఎస్ ఈ నెల 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. u గతంలో ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోని వారు.. ఒకేసారి బిల్లు చెల్లిస్తే.. ఆలస్య రుసుం, వడ్డీ మాఫీ అవుతాయి. u గతంలో ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులకు 50 శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది. u ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు.. భవిష్యత్తులో 24 నెలల పాటు తప్పనిసరిగా క్రమంగా బిల్లులు చెల్లిస్తామని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. బిల్లు చెల్లింపుల విషయంలో వారు విఫలమైతే, ఈ పథకం కింద వారు పొందిన ప్రయోజనాన్ని రద్దు చేస్తారు. u తమ నల్లా కనెక్షన్.. డిస్ కనెక్షన్ స్థితిలో ఉన్న వినియోగదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే.. ఇప్పటి దాకా పెండింగ్‌లో ఉన్న బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలు ఇలా.. u ఓటీఎస్ ఈ నెల 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. u గతంలో ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోని వారు.. ఒకేసారి బిల్లు చెల్లిస్తే.. ఆలస్య రుసుం, వడ్డీ మాఫీ అవుతాయి. u గతంలో ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులకు 50 శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది. u ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు.. భవిష్యత్తులో 24 నెలల పాటు తప్పనిసరిగా క్రమంగా బిల్లులు చెల్లిస్తామని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. బిల్లు చెల్లింపుల విషయంలో వారు విఫలమైతే, ఈ పథకం కింద వారు పొందిన ప్రయోజనాన్ని రద్దు చేస్తారు. u తమ నల్లా కనెక్షన్.. డిస్ కనెక్షన్ స్థితిలో ఉన్న వినియోగదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే.. ఇప్పటి దాకా పెండింగ్‌లో ఉన్న బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: సైబర్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్నారా.. మీ డబ్బు తిరిగొచ్చే చాన్స్!సద్వినియోగం చేసుకోవాలిపెండింగ్ బిల్లుల వినియోగదారులు వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గడువులోగా పెండింగ్ బకాయిలు చెల్లించి.. ఆలస్య రుసుం, వడ్డీ నుంచి మినహాయింపు పొందాలి. – అశోక్ రెడ్డి, జలమండలి ఎండీ -
టీసీఎస్ ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు కీలకం
ఐటీ కంపెనీ టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నది. దీంతో పాటు మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీ అంశంపై సుప్రీం కోర్టు విచారణ... తదనంతర పరిణామాలు, కరోనా కేసులు, వ్యాక్సిన్ సంబంధిత వార్తలు, అంతర్జాతీయ సంకేతాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా సోకడం... ఆయన ఆరోగ్య స్థితిగతులు కూడా ఈ వారం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతాయి. ఈ నెల 7న టీసీఎస్ ఫలితాలు.... మారటోరియం రుణాలపై, వడ్డీ మాఫీపై సుప్రీం కోర్టులో నేడు(సోమవారం) విచారణ జరగనున్నది. ఈ కేసు విషయమై సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు బ్యాంక్ రంగ షేర్లపై ప్రభావం చూపనున్నది. సోమవారం నాడే∙సేవల రంగం పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్ఐ) గణాంకాలు వస్తాయి. ఇక ఈ నెల 7 (బుధవారం) టీసీఎస్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నది. గత వారం సెన్సెక్స్, నిఫ్టీలు బాగా పెరిగినందున ఈ వారం లాభాల స్వీకరణకు అవకాశముందని కొందరు నిపుణులంటున్నారు. మూడు నెలల తర్వాత ‘విదేశీ’ అమ్మకాలు.... విదేశీ ఇన్వెస్టర్ల మూడు నెలల కొనుగోళ్లకు సెప్టెంబర్‌లో బ్రేక్‌పడింది. కరోనా కేసులు పెరుగుతుండటం, అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం దీనికి కారణం. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.7,783 కోట్ల నికర అమ్మకాలు జరపగా, డెట్ సెగ్మెంట్లో రూ. 4,364 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. వెరశి మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.3,419 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే, భారత మార్కెట్ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షించగలదని నిపుణులంటున్నారు. మెరుగుపడుతున్న వ్యాపార సెంటిమెంట్ సీఈవోలతో సీఐఐ సర్వే క్రమంగా దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలు రేకెత్తిస్తూ.. వ్యాపార సంస్థల్లో సెంటిమెంట్ మెరుగుపడుతోంది. కంపెనీల పనితీరు కూడా క్రమేపీ మెరుగుపడగలదని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో) భావిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సీఈవోల సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మెటల్స్, మైనింగ్, తయారీ, ఆటో, ఫార్మా, ఇంధనం, ఇన్ఫ్రా, నిర్మాణ తదితర రంగ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఇందులో పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సామర్థ్యాల వినియోగం 50 శాతానికి పైగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. అంటువ్యాధుల కట్టడిలో లాక్డౌన్ల ప్రయోజనాలు తక్కువగా ఉంటాయని సర్వే అభిప్రాయపడింది. ఎకానమీని పూర్తిగా తెరిస్తేనే డిమాండ్ మెరుగుపడుతుందని, తద్వారా ఉత్పత్తికి ఊతం లభిస్తుందని పేర్కొంది. -
రుణాలపై చక్రవడ్డీ మాఫీకి ఓకే
న్యూఢిల్లీ: వ్యక్తిగత రుణగ్రహీతలు, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు భారీ ఊరట లభించింది. కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన వాయిదాల చెల్లింపుపై మారటోరియంలో ఆయా రుణాల వడ్డీపై వడ్డీ(చక్రవడ్డీ)ని మాఫీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. రూ.2 కోట్ల వరకు రుణాలపై మారటోరియం విధించిన ఆరు నెలల కాలానికి ఈ రద్దు వర్తింపజేయనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ మేరకు ఆర్థిక శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. కోవిడ్ నేపథ్యంలో మార్చి 1 మొదలు ఆగస్టు 31వరకు చెల్లించాల్సిన రుణ వాయిదాలపై మారటోరియం విధిస్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్చిలో సర్క్యులర్ జారీచేయడం తెల్సిందే. అయితే, వడ్డీపై వడ్డీ విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. మారటోరియం కాలంలో రుణాల వడ్డీపై వడ్డీని వసూలు చేయడానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని సెప్టెంబర్ 28న కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. తన అఫిడవిట్లో ఆర్థిక శాఖ.. రూ.2 కోట్ల లోపు రుణ గ్రహీతలు మారటోరియంను ఉపయోగించుకున్న వారికి మాఫీ వర్తింప జేస్తామని తెలిపింది. మారటోరియం వాడుకోనివారికీ సంబంధిత ప్రయోజనాలను వర్తింపజేస్తామని తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్య పారిశ్రామిక సంస్థ(ఎంఎస్ఎంఈ)లు, విద్యా, గృహ, వినియోగ వస్తువులు, క్రెడిట్ కార్డు బకాయిలు, ఆటో, వ్యక్తిగత, వినియోగ తదితర 8 కేటగిరీల కింద ఈ రుణాలను గుర్తించినట్లు పేర్కొంది. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చిన్న రుణగ్రహీతలకు చేయూత అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొంది. అయితే, రూ.2 కోట్లకు మించిన వ్యక్తిగత, సంస్థాగత రుణాలకు మాఫీ వెసులుబాటు వర్తించదని స్పష్టం చేసింది. రుణ మాఫీకి, మారటోరియంకు తేడా తెలిసిన చాలా మంది రుణ గ్రహీతలు మారటోరియంను వినియోగించు కోలేదనీ, ఇలా ఎప్పటి మాదిరిగానే రుణ వాయిదాలు చెల్లించిన వారి సంఖ్య 50 శాతంపైనే ఉంటుందని తెలిపింది. చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు సంబంధించి రూ.3.7 లక్షల కోట్లు, గృహ, తదితర రుణాలకు సంబంధించిన రూ.70 వేల కోట్ల చక్రవడ్డీ భారం భరిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన గ్రాంట్ల కోసం పార్లమెంట్ అనుమతి పొందనున్నట్లు వెల్లడించింది. అన్ని కేటగిరీలు, తరగతుల రుణాలపై మారటోరియం కాలానికి చక్రవడ్డీ మాఫీ చేస్తే రూ.6 లక్షల కోట్లకు పైగానే భారం పడుతుందని పేర్కొంది. -
మారటోరియం వడ్డీ మాఫీ విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ అంశంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. గత విచారణలో కోర్టు కోరిన వివరాలు ఇచ్చేందుకు సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా మరి కొంత సమయం కావాలని కోరారు. రుణాల మారటోరియంకు సంబంధించి కేంద్రం, ఆర్బీఐ తీసుకున్న సమగ్ర వివరాలను సమర్పించాలని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం ఎస్జీని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకునే ప్రక్రియ తుదిదశలో ఉందని కోర్టుకు ఎస్జీ తెలిపారు. అదేవిధంగా సమగ్ర వివరాలు అందించేందుకు మరికొంత గడువు ఇవ్వాలని కోరారు. కేంద్రానికి గడువు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు అక్టోబర్ 5కి వాయిదా వేసింది. చదవండి: (ఆర్బీఐ, ప్రపంచ పరిణామాలే కీలకం!) -
రైతులు, పేదల రుణాలపై వడ్డీ మాఫీ చేయాలి
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న రైతులు, పేదల రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన ‘ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్(రెండో సవరణ)బిల్లు–2020’కు రాజ్యసభ స్వల్ప చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. దేశంలో కోవిడ్ నేపథ్యంలో వాణిజ్య సంస్థల దివాళా ప్రక్రియను మార్చి 25వ తేదీ మొదలుకొని ఆరు నెలలపాటు నిలుపుదల చేసేందుకు వీలు కల్పిస్తూ ఇందులో సవరణలు చేశారు. ఇందుకు సంబంధించి జూన్‌లో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఇది అమల్లోకి రానుంది. బిల్లుపై చర్చ సందర్భంగా జరిగిన చర్చలో పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. సీపీఎంకు చెందిన కేకే రాగేశ్ మాట్లాడుతూ..‘కోవిడ్ కారణంగా దెబ్బతిన్న వ్యాపారంగాన్ని, కార్పొరేట్లను గట్టెక్కించేందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇదే విషయాన్ని రైతులకు ఎందుకు వర్తింపజేయరు? రైతులూ దివాలా తీశారు. వారిని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? వారి రుణాలపై వడ్డీని ఎందుకు మాఫీ చేయదు?’ అని నిలదీశారు. పీఎం కేర్స్‌లో పారదర్శకత లేదు పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటును లోక్‌సభలో ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని ఆరోపించాయి. ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీకి చెందిన నేతలు పీఎం కేర్స్ ఏర్పాటుపై మండిపడ్డారు. ఈ నిధిని కాగ్ సమీక్ష పరిధికి వెలుపల ఉంచడమేంటని ప్రశ్నించారు. -
వడ్డీమాఫీపై స్పష్టత ఇవ్వండి
న్యూఢిల్లీ: కరోనా కారణంగా రుణవాయిదాలపై మారటోరియం విధించిన కేంద్ర ప్రభుత్వం ఆ వాయిదాలపై వడ్డీని మాఫీ చేసే విషయమై ఒక నిర్ణయానికి రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద పలు అధికారాలు ఉన్నప్పటికీ ఆర్బీఐ సాకు చూపుతూ ఈ అంశంపై ఏ నిర్ణయమూ తీసుకోలేదని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ కేంద్రాన్ని తప్పుపట్టింది. ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలన్న సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తూ వారం గడువు ఇచ్చింది. ఈ సందర్భంగా తుషార్ మెహతా మాట్లాడుతూ తాము ఈ అంశంపై ఆర్బీఐతో కలిసి పనిచేస్తున్నట్లు జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షా లతో కూడిన బెంచ్‌కు తెలిపారు. కేంద్రం విపత్తు నిర్వహణ చట్టంపై స్పష్టత కల్పించాలని, ఇప్పటికే వసూలు చేస్తున్న వడ్డీపై అదనపు వడ్డీ వసూలు సాధ్యమవుతుందా? అని బెంచ్ ప్రశ్నించగా తుషార్ మెహతా స్పందిస్తూ... అన్ని సమస్యలకు సాధారణ పరిష్కారం ఉండదన్నారు. ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తూ మార్చి 27న ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌లోని కొంత భాగాన్ని చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని కోరారు. రుణ వాయిదాలపై నిషేధం విధించిన నేపథ్యంలో ఆ వాయిదాలపై వడ్డీ వసూలు చేయడం సరికాదని, దీనివల్ల తనకు సమస్యలు వస్తున్నాయని గజేంద్ర శర్మ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తను జీవించే హక్కుకు భంగం కలిగిస్తోందని గజేంద్ర శర్మ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. రుణ వాయిదాలపై మారటోరియం గడువును పొడిగించాలని కోరారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబరు ఒకటవ తేదీకి వాయిదా వేసింది. -
వడ్డీ మాఫీ వట్టిదేనా!
ఆదిలాబాద్‌రూరల్: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఏటా బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తోంది. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం వడ్డీని తిరిగి ఇస్తోంది. 2019 నవంబర్‌లో బ్యాంకు లింకేజీ రుణాల వడ్డీని ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వీటికి సంబంధించిన ఉత్తర్వులు సైతం జారీ చేసింది. మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో వడ్డీలేని రుణ పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాని నెలల తరబడి ప్రభుత్వం వడ్డీని విడుదల చేయకపోవడంతో రుణం పొందిన మహిళా సంఘా ల సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని నెలలుగా పెండింగ్ జిల్లాలో కొన్ని నెలలుగా వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో మహిళా సంఘాల సభ్యులు నిరాశతో ఉన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి క్రమం తప్పకుండా వడ్డీతో సహా వాయిదాలు చెల్లిస్తున్నారు. వాయిదాల చెల్లింపులో క్రమం తప్పితే వడ్డీ మినహాయింపు అవకాశం కోల్పోతారు. దీంతో బ్యాంకు లింకేజీ కింద పొందిన రుణాలకు మహిళా సంఘాల సభ్యులు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూ ప్రభుత్వం విడుదల చేయనున్న వడ్డీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గత నవంబర్‌లో రూ.618 కోట్లు పెండింగ్‌లో ఉన్న రుణాలకు వడ్డీని విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాని ఈ నిధులు ఇంత వరకు రాలేదు. జమ కాని వడ్డీ జిల్లాలో వడ్డీలేని రుణ పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు పొంది క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్న సంఘాలకు సంబంధించి వడ్డీని తిరిగి ప్రభుత్వం చెల్లిస్తోంది. వీటిని ఆయా సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో రూ.107 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా రూ.102 కోట్లు రుణాలు ఇచ్చారు. ఈ రుణాలు పొంది క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూ వడ్డీలేని రుణ పథకానికి అర్హత సాధించిన అన్ని సంఘాల సభ్యులకు వడ్డీ జమ చేయాల్సి ఉంది. రెండేళ్ల నుంచి ఎదురుచూపులు రెండేళ్ల నుంచి వడ్డీ జమకాకపోవడంతో మ హిళా సంఘాలు ఇబ్బందులు పడుతున్నాయి. గతంలో ప్రభుత్వం చేసిన ప్రకటనతో సంఘాల సభ్యులు ఎంతో సంబరపడ్డారు. వడ్డీ డబ్బుతో ప్రస్తుతం చేస్తున్న స్వయం ఉపాధి పనులను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం కలుతుందని ఆశించారు. కాని ప్రభుత్వం ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వాటి ఊసేత్తకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంక్ లింకేజీ రుణాల వడ్డీ ఇవ్వాలి మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం బ్యాంక్ లింకేజీ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం అభినందనీయం. కాని వడ్డీని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖాతాల్లో జమ చేస్తే బాగుంటుంది. దీంతో మహిళలు మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. – రాధ, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు, ఆదిలాబాద్‌రూరల్ రాగానే అందజేస్తాం గత ఆర్థిక సంవత్సరంలో రూ.107 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా రూ.102కోట్లు అందజేశాం. వడ్డీ లేని రుణాలకు నిధులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం వాస్తవమే. కాని ఇప్పటి వరకు ఈ నిధులు రాలేదు. రాగానే వారి ఖాతాల్లో జమ చేస్తాం.– రాజేశ్వర్ రాథోడ్, డీఆర్డీవో -
పంట రుణాలపై 660 కోట్ల వడ్డీ మాఫీ
నవంబర్, డిసెంబర్లకు వర్తింపు ► గృహ రుణ వడ్డీ రాయితీ పథకానికి ఓకే ► వరిష్ట పెన్షన్ బీమా యోజనకూ ఆమోదం ► కేంద్ర కేబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో నగదు దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. సహకార బ్యాంకుల నుంచి 2016 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య తీసుకున్న స్వల్పకాలిక పంటరుణాలపై ఆ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలకుగాను రూ. 660.50 కోట్ల వడ్డీని మాఫీ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్, డిసెంబర్ల వడ్డీని చెల్లించిన రైతులకు ఆ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తుందని వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ చెప్పారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సహకార బ్యాంకులకు 4.5 శాతం వడ్డీతో రుణంగా ఇవ్వడానికి రూ. 20 వేల కోట్ల రుణాలను తీసుకునేందుకు నాబార్డ్‌కు కేబినెట్ అనుమతినిచ్చింది. 1.8 శాతం వడ్డీ రాయితీ, 0.2 శాతం పాలనా వ్యయాన్ని నాబార్డ్ భరించేందుకు రూ. 400 కోట్ల గ్రాంట్ కూడా ఇవ్వాలని నిర్ణయించింది. గృహ రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ గ్రామీణ ప్రజలు కొత్త ఇళ్లు కట్టుకోవడానికి, లేదా ప్రస్తుత ఇళ్ల అభివృద్ధి కోసం తీసుకునే గృహ రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ ఇచ్చే పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాసయోజన(గ్రామీణ్) కిందికి రాని ప్రతి కుటుంబానికీ రూ. 2 లక్షల వరకు రుణంపై ఈ రాయితీ ఇస్తారు. దీనితో పేదలకు నెల వాయిదాల(ఈఎంఐ)పై భారం తగ్గుతుందని, ఈ పథకాన్ని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అమలు చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాని మోదీ కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా ఈ పథకాన్ని ప్రకటించడం తెలిసిందే. సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీ సీనియర్ సిటిజన్లకు పదేళ్లపాటు ఏటా 8 శాతం వడ్డీ ఇచ్చే వరిష్ట పెన్షన్ బీమా యోజన–2017 పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది.. వీటిలో దేన్ని ఎంచుకుంటే దాని ప్రాతిపదికగా పెన్షన్ అందిస్తారు. ఎల్ఐసీ అమలు చేయనున్న ఈ పథకంలో 60 ఏళ్లు, ఆపై వయసున్న వారు పథకం మొదలైన నాటి నుంచి ఏడాది లోపల చేరవచ్చు. ఐఐఎంల నుంచి ఇక డిగ్రీలు దేశంలోని 20 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లు ఇకపై తమ విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా, ఫెలో ప్రోగ్రామ్స్ ఇన్ మేనేజ్మెంట్లు కాకుండా ఎంబీఏ వంటి డిగ్రీలు, పీహెచ్‌డీలు ఇవ్వనున్నాయి. ఐఐఎంలను ఇకపై జాతీయ ప్రాధాన్య సంస్థలుగా గుర్తిస్తారు. దీనికి సంబంధించిన ఐఐఎం–2017 బిల్లును కేబినెట్ ఆమోదించింది. దీన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఐఐఎంలకు సంపూర్ణ స్వయంప్రతిపత్తిపై బిల్లు దృష్టి సారించిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఐఐఎంలు సొసైటీల చట్టం కింద రిజిస్టర్ అయి ఉండడంతో వీటికి డిగ్రీలు ఇచ్చే అవకాశం లేదు. ఈ సంస్థలు ఇచ్చే డిప్లమాలు, ఫెలో ప్రోగ్రామ్‌లు.. ఎంబీఏ, పీహెచ్‌డీలకు సమానంగా భావిస్తున్నా వీటి సమానత్వంపై సార్వత్రిక ఆమోదం లేదు. కాగా, హరితవాయు ఉద్గారాల కట్టడికి కోసం క్యోటో ప్రొటోకాల్ రెండో దశ అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నారైలకు ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనూ, ప్రతినిధి ద్వారానూ ఓటు వేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను వాయిదా వేసింది.