న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 326 కోట్లకు పరిమితమైంది.
అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 365 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం స్వల్ప వృద్ధితో రూ. 4,587 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,263 కోట్ల ఆదాయం నమోదైంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 21% ఎగసి రూ. 1,796 కోట్లను తాకింది. 2021– 22లో రూ. 1,482 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 7% పుంజుకుని రూ. 17,838 కోట్లను అధిగమించింది. 2021–22లో రూ. 16,725 కోట్ల ఆదాయం మాత్రమే నమోదైంది.
ఫలితాల నేపథ్యంలో టాటా కమ్యూనికేషన్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం జంప్‌చేసి రూ. 1,226 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment