మనిషి ‘సోషల్’గా బతడకం ఈరోజుల్లో ప్రధానంగా మారింది. అయితే సోషల్ మీడియా మాధ్యమాలు మనిషి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపెడుతున్నాయా? అంటే.. అవుననే అంటారు మానసిక వైద్యులు. అయితే అందులో ఫొటో, వీడియో కంటెంట్ యాప్‌ల వల్ల టీనేజీ అమ్మాయిల మానసిక స్థితి మరింత దిగజారిపోతోందని సర్వేలు చెప్తున్నాయి కూడా.
గుజరాత్‌లో ఈమధ్యే ఓ టీనేజర్ విచిత్రమైన కారణంతో అఘాయిత్యానికి పాల్పడింది. ఏడాది క్రితం సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసిన ఫొటోలో రూపం.. ఇప్పుడు ఒకేలా లేవంటూ సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యకు చేసుకుంది. ఇది ఆ ఒక్క అమ్మాయి సమస్యే కాదు.. కోట్లలో మంది టీనేజర్లు ఇప్పుడు సరిగ్గా అలాంటి మానసిక రుగ్మతను ఎదుర్కొంటున్నారు. చాప కింద నీరులా విస్తరిస్తోంది ఈ సమస్య. ఇందులో విశేషం ఏంటంటే.. ఇదంతా తెలిసి కూడా టీనేజర్లను ఆ కుంగుబాటు నుంచి బయటపడే దిశగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం.
సరదా నుంచి సీరియస్
సోషల్ మీడియా పవర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అందులో ఇన్‌ఫర్మేషన్, ఎడ్యుకేషన్, ఆర్ట్, మీమ్స్, అశ్లీలత.. ఇలా అవసరం ఉన్నవీ లేనివీ అన్నీ యూజర్లకు చేరవేస్తున్నాయి. అయితే టీనేజర్లలో.. అందులో అమ్మాయిల్లో ఇది మానసిక సమస్యల్ని పెంపొందించే ప్లాట్‌ఫామ్‌గా మారుతోంది. 2019 నుంచి జరుగుతున్న దాదాపు ప్రతీ సర్వే ఈ విషయాన్ని వెల్లడించగా.. తాజాగా ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ మీడియా హౌజ్ ఆ కథనాలన్నింటిని ప్రస్తావిస్తూ సమగ్రంగా ఓ రిపోర్ట్‌ను ప్రచురించింది.
► ప్రతీ ముగ్గురిలో ఒక అమ్మాయి ఫొటో, వీడియో కంటెంట్ యాప్ ద్వారా మానసికంగా కుంగిపోతున్నారు
► బాడీ ఇమేజ్ ఇష్యూస్‌ను ఎదుర్కొంటున్నారు.. సెల్ఫ్ డ్యామేజ్ చేసుకుంటున్నారు
► సోషల్ మీడియా యాప్‌లు తమ పరిస్థితిని దిగజారుస్తున్నాయని 32 శాతం మంది టీనేజర్లు స్వయంగా ఒప్పుకున్నారు (కిందటి ఏడాది జరిపిన ఓ సర్వేలో)
► ఎదుటివాళ్ల కంటే ముందే సెల్ఫ్ బాడీ షేమింగ్ చేసుకుని బాధపడడం
► ఈ లిస్ట్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెనర్లు సైతం ఉండడం విశేషం.
► ఇతరులతో పోల్చుకుంటూ తాము తక్కువనే భావనను పెంపొందించుకోవడం.
► ఈటింగ్ డిజార్డర్స్, డైటింగ్ పేరుతో అనారోగ్యాలు(2021 మేలో వెల్లడించిన ఒక రిపోర్ట్)
► మెంటల్‌గా నెగెటివ్ ఆలోచనలు పెరిగిపోయి.. డిప్రెషన్‌లోకి కూరుకుపోవడం
► ఆత్మనూన్యత భావం కలగడానికి ఫొటో, వీడియో కంటెంట్ బేస్ యాప్‌లు ప్రధాన కారణమని 43 శాతం అభిప్రాయం(జులై 2021 రిపోర్ట్)
► ఈ పరిస్థితులన్నీ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల దాకా చాలామందిని తీసుకెళ్తున్నాయట.
► 13 శాతం టీనేజర్లు బ్యూటీ ప్రొడక్టుల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, అందులో 2 శాతం ముఖాన్ని పాడుచేసుకుంటున్నారట.
► తమ ‘సోషల్’ ట్యాగ్‌ను నిలబెట్టుకోవాలనే ఆత్రుతతో దుస్తుల కోసం అతిఖర్చు.
► అయితే 18 శాతం మంది మాత్రం ‘మా బాడీ మా ఇష్టం’ అనే స్లోగన్‌తో పాజిటివిటీని పెంపొందించుకుంటూ ముందుకెళ్తున్నారు.
కంపెనీలు చెప్తున్నా..
సోషల్ మీడియా వల్ల నెగెటివ్ కంటే పాజిటివ్ ఉందంటూ మార్క్ జుకర్‌బర్గ్ లాంటి వాళ్లు స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు. విశేషం ఏంటంటే.. ప్రతీ ప్లాట్‌ఫామ్ అంతర్గత సర్వేలో అవి చేసే డ్యామేజ్‌ల గురించి నివేదికలు వెలువడుతూనే ఉన్నాయి. ఉదాహరణకు.. మే 2021లో ఇన్‌స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మోస్సెరీ.. టీనేజ్ యువతుల మానసిక స్థితిపై సోషల్ మీడియా నిజంగానే దుష్ప్రభావం చూపెడుతోందని ప్రకటన ఇచ్చారు.
ఇలా చేయడం బెటర్
► పిల్లల సోషల్ మీడియా వాడకంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ
► మంచి చెడుల గురించి పిల్లలకు వివరించి చెప్పడం.. అవసరమైతే కేసుల ఉదాహరణల్ని ప్రస్తావించడం
► మితంగా సోషల్ మీడియా వాడకం
► మొబైల్ డాటాను అవసరమైతేనే ఆన్ చేయడం
► సోషల్ మీడియాలో ఇతరుల్ని అనుకరించకపోవడం.. ఇతరులతో పోల్చుకోకపోవడం
- సాక్షి, వెబ్‌స్పెషల్
Comments
Please login to add a commentAdd a comment