సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారులకు భద్రత, రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యకలాపాలు తెలంగాణలో ఊపందుకున్నాయి. రెరాలో ప్రాజెక్ట్‌ల నమోదులో దేశంలోనే తెలంగాణ నాల్గో స్థానంలో నిలిచింది. టీఎస్ రెరాలో 4,002 రియల్టీ ప్రాజెక్ట్‌లు, 2,017 మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రెరాలో 2,248 ప్రాజెక్ట్‌లు, 151 మంది మధ్యవర్తులు నమోదయ్యా రు. దేశవ్యాప్తంగా 74,088 ప్రాజెక్ట్‌లు, 58,790 మంది ఏజెంట్లు రెరాలో నమోదయ్యారు.
అత్యధికంగా మహారాష్ట్ర రెరాలో 33,154 ప్రాజెక్ట్‌లు 11,231 మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. గుజరాత్‌లో 9,689 ప్రాజెక్ట్‌లు, 2,695 మంది మధ్యవర్తులు, మధ్యప్రదేశ్‌లో 4,016 ప్రాజెక్ట్‌లు 935 మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, రాజస్తాన్, కర్ణాటక రెరాలో వెయ్యికి పైగా ప్రా జెక్ట్‌లు రిజిస్టరయ్యాయి. అత్యల్పంగా ఎన్‌సీఆర్ రెరాలో 34, పాండిచ్చేరి రెరాలో 194, ఉత్తరాఖండ్‌లో 332 ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి.
శాశ్వత అథారిటీ లేదు..
తెలంగాణ, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాల్లో మాత్రమే శాశ్వత రెరా అథారిటీ లేదు. ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఇంటెర్మ్ రెరా అథారిటీనే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే రెరాను ఏర్పాటు చేయని రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment