
దేశీ ఈకామర్స్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా షేర్ల బదలాయింపు జరిగింది. పబ్‌జీ వంటి వివాస్పద గేమ్‌ను పరిచయం చేసిన టాన్‌సెంట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన డీల్ 2021 అక్టోబరులో జరగగా తాజాగా ఈ వివరాలను బయటకు వెల్లడించారు.
ఫ్లిప్‌కార్ట్‌ను స్టార్టప్‌గా సచిన్‌బన్సాల్, బిన్నీ బన్సాల్‌లు నెలకొల్పారు. ఆ తర్వాత సచిన్ బన్సాల్ తన వాటాలు అమ్ముకుని ఫిన్‌టెక్ సెక్టార్‌లోకి వెళ్లారు. కాగా బన్ని బన్సాల్‌కు ఫ్లిప్‌కార్ట్ ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. కాగా టెన్‌సెంట్ సంస్థ బిన్నిబన్సాల్ నుంచి 0.72 శాతా వాటాలను 264 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌తో సహా అనేక అంతర్జాతీయ కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి.