
ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. నేడు (ఏప్రిల్ 23) తులం పసిడి ధర గరిష్టంగా రూ. 1530 తగ్గింది. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66150 (22 క్యారెట్స్), రూ.72160 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 500 నుంచి రూ. 550 వరకు తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ ఏకంగా రూ. 1400 నుంచి రూ. 1500 తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66300 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72310 రూపాయలకు చేరింది. నిన్న రూ.510, రూ.550 వరకు తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 1400 నుంచి రూ.1530 వరకు తగ్గింది.
దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. చెన్నైలో పసిడి ధరలు మరింత తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 1450 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1570 రూపాయలు తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ. 67000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 73100 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.
వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఈ రోజు (ఏప్రిల్ 23) వెండి ధర రూ. 2500 తగ్గి రూ. 83000 (కేజీ) వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా గరిష్ట స్థాయిలో తగ్గుముఖం పట్టాయి.