దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులను భయపెట్టేస్తున్నాయి. గత వారం రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ తారాజువ్వలా పైకి లేశాయి. నేడు దేశంలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.65500 (22 క్యారెట్స్), రూ.71440 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు రూ. 1200, రూ. 1310 వరకు పెరిగింది.
చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 1200 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1310 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 65500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 71440 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 65500 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 71440 రూపాయలకు చేరింది. నిన్న కొంత తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈ రోజు ఏకంగా రూ. 1200, రూ. 1310 పెరిగింది.
వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 6) వెండి ధర ఒక్కసారిగా రూ. 1800 పెరిగి రూ. 83500 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment