
దేశంలో బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం (సెప్టెంబర్ 1) పసిడి ధర కాస్త తగ్గుముఖం పట్టింది. అలాగే వెండి కూడా మోస్తరుగా తగ్గింది.
దేశవ్యాప్తంగా శుక్రవారం (సెప్టెంబర్ 1) 24 క్యారెట్ల బంగారం ధర తులానికి (10 గ్రాములు) రూ.100 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర తులానికి రూ.110 క్షీణించింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.60,050 ఉండగా, 22 క్యారెట్ల పుత్తడి తులం ధర రూ.55,050 లుగా ఉంది.
ఇదీ చదవండి: దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు
ఇక వెండి ధరలు కూడా దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం (సెప్టెంబర్ 1) వెండి ధర కేజీకి రూ.500 తగ్గింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.80,200 ఉంది. క్రితం రోజు ఇది రూ.80,700 లుగా ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment