Today Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. క్రితం రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ సూచీలు ఈరోజు కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటలకు ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 280 పాయింట్ల నష్టంతో 65,971 పాయింట్ల వద్ద.. నిఫ్టీ 144 పాయింట్ల నష్టంతో 19,272 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ఎన్‌ఎస్‌ఈలో ఓన్‌జీసీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్ కంపెనీ షేర్లు లాభాల్లోకి వచ్చి టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. అలాగే విప్రో, హిందాల్కో, టెక్ మహీంద్ర, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లోకి జారుకుని టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment