న్యూఢిల్లీ: హార్డ్‌కోర్ అంటూ ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ జారీ చేసిన అల్టిమేటంపై వందలాదిమంది ఉద్యోగులు అనూహ్యంగా స్పందించారు. ఎక్కువ పనిగంటలు పనిచేస్తూ హార్డ్‌కోర్‌గా ట్విటర్‌లో ఉంటారా, ఇంటికి చెక్కేస్తారా అన్న ప్రశ్నకు చాలామంది ఎగ్జిట్ ఆఫ్షన్‌ను ఎంచుకోవడంపై మస్క్ స్పందించారు.
చాలా మంది ఉద్యోగులు తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు దీంతో కంపెనీ తన కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేయవలసి వచ్చింది. నవంబరు 21 సోమవారం వరకు ట్విటర్ కార్యాలయాలు మూసివేస్తున్నట్టు ట్విటర్ అధికారిక ప్రకటన జారీ చేసింది. అలాగే కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కాన్పిడెన్షియల్ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా గానీ, మీడియా ద్వారాగానీ బహిర్గంతం చేయొద్దని కూడా కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అసలు ట్విటర్‌లో అసలు ఏం జరుగుతోంది అనే చర్చ తీవ్రమైంది. సామూహిక రాజీనామాల కారణంగా ట్విటర్ ఆఫీసులు మూత పడిన కొన్ని గంటల తరువాత మస్క్ ట్విటర్‌లో స్పందించారు. బెస్ట్ పీపుల్ ఉంటున్నారు. కాబట్టి తనకేమీ ఆందోళన లేదని మస్క్ ట్వీట్ చేశారు.అంతేకాదు వాడకంలో ట్విటర్ కొత్త గరిష్టాన్ని తాకిందంటూ ట్వీట్ చేయడం గమనార్హం. (ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు: అమెజాన్ కీలక నిర్ణయం)
మరోవైపు తాజా పరిమాణాల నేపథ్యంలో ట్విటర్‌లో RIPTwitter హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది.
The best people are staying, so I’m not super worried
— Elon Musk (@elonmusk) November 18, 2022
ఇవీ చదవండి: ఎలాన్ మస్క్‌కు భారీ ఝలక్.. ఇప్పుడేం చేస్తావ్!
త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్ సంచలన ప్రకటన
Goodbye twitter, been a good run. #RIPTwitter pic.twitter.com/fkkUZWz2oQ
— Bish 🗽 (@thebishundercov) November 18, 2022
Everyone on Twitter to Elon Musk right now #RIPTwitter #TwitterTakeover pic.twitter.com/m03XswU9QN
— Abhishek Rathore ✿ (@AbhishekSachib) November 18, 2022
Comments
Please login to add a commentAdd a comment