భారతీయ విద్యార్థులకు భారత్‌లోని అమెరికన్ ఎంబసీ కార్యాలయం శుభవార్త చెప్పింది. చట్టబద్దంగా అమెరికాలో చదువుకునేందుకు అర్హులైన విద్యార్ధులు పొందే ఐ-20 పత్రాలు ఉండి, ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్ స్లాట్లు బుక్ చేసుకోవాలని ప్రకటించింది.
అమెరికాలో చదువుకునేందుకు వేలాది మంది విద్యార్ధులకు యునైటెడ్ స్టేట్స్‌లోని స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సెర్టిఫైడ్ స్కూల్(ఎస్‌ఈవీఐసీ)లో అడ్మిషన్ లభిస్తుంది. దీని తర్వాత సంబంధిత స్కూల్ నుంచి అర్హులైన విద్యార్ధులకు అధికారులు ఫారమ్ ఐ-20ని పంపుతారు.
Student visa appointments are available on our website. If you have an I-20, don't wait! Future F, M, and J appointment openings at the Embassy and Consulates will be for interviews taking place after Aug 14, so if you need to arrive at school by mid-Aug, book an appointment now!
— U.S. Embassy India (@USAndIndia) June 24, 2022
అయితే విద్యార్ధులందరూ పైన పేర్కొన్న ఐ-20 ఫారమ్‌ను అమెరికన్ యూనివర్సిటీస్ నుంచి పొందారు. యూనివర్సిటీతో పాటు అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పని సరి. ఇందుకోసం భారత్‌లో ఉన్న యూఎస్ ఎంబసీ విద్యార్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఆ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
కానీ ఆ ఇంటర్వ్యూలను నిర్వహించలేదు. అందుకే భారత విదేశాంగ శాఖ యూఎస్‌తో చర్చలు జరిపి..భారతీయ విద్యార్ధులకు వీసాలు మంజూరు చేయాలని కోరింది. భారత్ కోరిక మేరకు 2022 జూన్- జులై కావాల్సిన ఇంటర్వ్యూ స్లాట్లను మే నెలలో ఓపెన్ చేసింది. తాజాగా..మరో సారి ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు సన్నద్ధమైంది.
ఇందులో భాగంగా..త్వరలో యూఎస్ ఎంబసీ, కాన్సలేట్ కార్యాలయాల్లో విద్యార్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. ఐ-20 డాక్యుమెంట్లు ఉంటే ఆలస్యం చేయకుండా మేం నిర్వహించే ఇంటర్వ్యూల కోసం స్లాట్‌లు బుక్ చేసుకోండి. విద్యార్ధులు పొందాల్సిన ఎఫ్, ఎం, జే వీసాల కోసం ఆగస్టు14 తర్వాత ఇంటర్వ్యూలు జరగుతాయి," అని ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం చేసిన ట్వీట్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment