WhatsApp To Update Terms Of Service And Privacy Policy In 2021, Check Details Here - Sakshi
Sakshi News home page

అలర్ట్: కొత్త ఏడాదిలో వాట్సాప్ నుంచి బిగ్ అప్‌డేట్ 

Published Wed, Jan 6 2021 2:24 PM | Last Updated on Wed, Jan 6 2021 6:33 PM

WhatsApp Updates Terms of Service and Privacy Policy - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన మెసేజింగ్ యాప్లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇంతలా ఆదరిస్తున్న తన వినియోగదారుల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంటుంది. తాజాగా కొత్త ఏడాదిలో కూడా కొత్త అప్‌డేట్ తో ముందుకు వచ్చింది. ఈ అప్‌డేట్ లో భాగంగా టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ అప్‌డేట్ ను తీసుకొచ్చింది. 2021లో కొత్త నియమ నిబంధనలు తీసుకొస్తున్నట్లు గతంలో వాట్సాప్ ప్రకటించింది. అందులో భాగంగానే ఈ టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ అప్‌డేట్ ను తీసుకొచ్చినట్లు వాట్సాప్ తన బ్లాగ్ వాబీటా ఇన్ఫోలో ప్రకటించింది.(చదవండి: మార్కెట్లోకి వన్‌ప్లస్ కొత్త ప్రోడక్ట్)

కొత్తగా తీసుకొచ్చిన టర్మ్స్ అండ్ ప్రైవసీ రూల్స్‌ని ప్రతి ఒక్కరు అంగీకరించాల్సి ఉంటుంది. ఒకవేల వాట్సాప్ కొత్త రూల్స్‌ని అంగీకరించక పొతే వారి మొబైల్లో తమ సేవలను 2021 ఫిబ్రవరి 8 నుంచి నిలిపివేయనునట్లు ప్రకటించింది. ప్రతి ఒక్కరికి ఈ కొత్త టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ రూల్స్‌ని దశల వారీగా పంపుతున్నట్లు పేర్కొంది. చాలా మంది తమకు ఈ కొత్త అప్‌డేట్ వచ్చినట్లు షేర్ చేసుకుంటున్నారు. గతంలో 19 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంలో భాగంగా ఫేస్‌బుక్ 2014లో కొనుగోలు చేసినప్పటి నుండి ఇది ఎలా పనిచేస్తుందనే దానిపై వాట్సాప్ విమర్శలను ఎదుర్కొంది. యూజర్ల గోప్యత మరియు డేటా భద్రత గురించి చాలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ కొత్త రూల్స్‌ని తీసుకొస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement