మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ మైనారిటీ నాయకులు
రొంపిచెర్ల: రాష్ట్ర అటవీ, విద్యుత్, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో రొంపిచెర్ల–1 టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు రహీమబీ, పలువురు మైనారిటీ నాయకులు గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన రహీమబీ, నా యకులు అజంతుల్లా, బారుద్దీన్, హలిమా, మజీ మా, అధిల్ మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ముస్లింల అభ్నున్నతికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నా రని తెలిపారు.
విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ క ల్పించారని పేర్కొన్నారు. మంత్రి వర్గంలో స్థానం కల్పించారని తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ముస్లింలకు సరైన గుర్తింపు లేదని, అందుకే ఆ పార్టీని వదిలి వైఎస్సా ర్‌సీపీలో చేరామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ పటిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు.
మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన వారికి ప్రత్యేక గుర్తింపు ఇస్తామని తెలిపారు. అందరు కలసి కట్టుగా పార్టీ కోసం పని చేయాలని సూచించారు. ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డీశ్వర్ రెడ్డి, సర్పంచ్ ఇబ్రహీంఖాన్, నాయకులు బషీర్, చిన్న నాగరాజ, విజయశేఖర్, ఇజాజ్, బు డాన్ సాహెబ్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment