
మహేష్ (ఫైల్)
బైరెడ్డిపల్లె : మండలంలోని గడ్డూరులో సోమవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. వివరాలు.. గడ్డూరు గ్రామానికి చెందిన జయప్ప కుమారుడు మహేష్ (15) కమ్మనపల్లె మోడల్‌స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం పరీక్షకు హాజరై ఇంటికి చేరుకున్నాడు. గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు బావిలో మునిగిపోయి మరణించాడు. దీనిపై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. జయప్పకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. మహేష్ మరణవార్త విని తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment