పాలసముద్రం : ఓ యువతికి సమీప బంధువుతో కట్టబెట్టాలని బలవంతం చేయడంతో యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన ముంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు సరిహద్దులోని గ్రామానికి చెందిన ఓ యువతి గార్మెంట్స్‌లో పనిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం యువతి బంధువులు తమ సమీప బంధువుతో పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బావి చుట్టు ప్రక్కల గాలించడంతో ఆ యువతి ముళ్లపొదల్లో ఉన్నట్లు గుర్తించి యువతి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి యువతిని అప్పగించారు. కాగా ఆ యువతికి ఇంతక ముందే వివాహమై విడిపోయినట్లు బంధువులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment